పరస్పర్శాత్తు వైదేహ్యా న దుఃఖతరమస్తి మే । పితుర్వియోగాత్ సౌమిత్రే! స్వరాజ్యహరణాత్ తథా ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ద్వితీయస్సర్గః (౨౧వ శ్లోకము)

విరాధుడు సీతమ్మవారిని ఎత్తుకుపోయినప్పుడు తీవ్రమైనతాపమునకు శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను:

“ఓ సౌమిత్రీ! నాకు రాజ్యాభిశేకము జరగనప్పుడు బాధకలుగలేదు. నాకు పితృవియోగమే అతిదారుణమైన దుఃఖము. దాటికంటే తీవ్రమైన బాధ నాకిప్పుడు జానకి యొక్క దుస్థితిచూసి కలుగుచున్నది”.

భార్యపై భర్తకు ఉండవలసిన ప్రీతి ఈ శ్లోకము ద్వారా ఆవిశ్కరించినారు వాల్మీకిమహర్షి.

Advertisements