న్యస్తదణ్డా వయం రాజన్ జితక్రోధా జితేన్ద్రియాః । రక్షితవ్యాస్త్వయా శశ్వత్ గర్భభూతాస్తపోధనాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ప్రథమోధ్యాయః (౨౦వ శ్లోకము)

రాక్షసులబారినుండి తమను కాపాడే భారము శ్రీరామునిదే అని నివేదిస్తూ దండకారణ్యములోని ఋషులు ఈ అపూర్వశ్లోకమును పల్కిరి:

“ఓ రామా! మేము ఆయుధములనన్నిటిని త్యజించితిమి (ఆత్మరక్షణకైకూడా హింసను చేయము!). తపస్సుకు పరమశత్రువైన క్రోధమును పూర్తిగావిడిచితిమి (కావున శాపవాక్కులు పల్కము). ఇంద్రియనిగ్రహము పాటించుచున్నాము. కావున గర్భస్థశిశువులను కాపాడుకొనురీతి మమ్ము నీవే కాపాడవలెను”.

ఇక మనము నేర్వవలసిన నీతులు:

  1. ఆత్మరక్షణకైకూడా ఏమాత్రము హింసచేయని సాధువులను కాపాడుట రాజ ధర్మము.
  2. ఇట్టివారిని రక్షించుట భగవంతుడైన శ్రీరాముని కర్తవ్యమని ఈ శ్లోకపు తాత్వికార్థము. ఇదే యోగక్షేమం వహామ్యహం అనే భగవంతుడిచ్చిన హామీ.
  3. గర్భస్థశిశువులను కంటికి రెప్పవలె కాపాడుట తల్లిదండ్రుల ధర్మమేకాక, ఇట్టి అసహాయులను కాపాడుటకు వీలైన భద్రతలను కల్పించుట రాజు యొక్క కర్తవ్యము.

భ్రూణహత్య మహాపాపమని ఘోషించిన వేదాలు పుట్టిన భారతదేశంలోనే నేడు abortion పేరుతో జరిగే దారుణమారణహోమములు విచ్చలవిడిగా జరుగుట కడు విచారణీయము.

Advertisements