తతో రామస్య సత్కృత్య విధినా పావకోపమాః । ఆజహ్రుస్తే మహాభాగాః సలిలం ధర్మచారిణః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అరణ్యకాణ్డే ప్రథమోధ్యాయః (౧౫వ శ్లోకము)

“ధర్మాచారపరాయణులు, అగ్నితోసమాన తేజస్వులు అయిన (దండకారణ్యములోని) ఋషులు యథావిధిగా సీతారామలక్ష్మణులకు అతిథిసత్కారములను అర్పించిరి” అని ఈ శ్లోకార్థము.

తపోదీక్షలోనుండి, ఐహికసుఖాలను త్యజియుండి, త్రికాలవేదులైకూడా తమ విధ్యుక్తధర్మములను విడువని ఈ ఋషులే భారతీయులకు మార్గదర్శకులు.

అతిథిపూజనము యొక్క ప్రాధాన్యతకూడా ఈ శ్లోకముద్వారా తెలుస్తున్నది.

Advertisements