దీయమానాం న తు తదా ప్రతిజగ్రాహ రాఘవః । అవిజ్ఞాయ పితుశ్ఛన్దం అయోధ్యాధిపతేః ప్రభోః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టాదశోత్తరశతతమస్సర్గః (౫౧వ శ్లోకము)

శివధనుస్సును ఎక్కుపెట్టిన శ్రీరాముని చూసి పొంగిపోయి, తన కూతురైన సీతని శ్రీరామునికి ధారపోయుటకు ఉద్యమించెను జనకుడు.

అప్పుడు శ్రీరాముడు జనకమహారాజుతో తన తండ్రిగారైన దశరథుని అనుమతి లేనిదే సీతను గ్రహించలేనని చెప్పెనని ఈ శ్లోకార్థము.

వివాహాదివిషయాలలో నిర్ణయము తల్లిదండ్రులదేయని తేల్చిచెప్పే రాముని ఈ వచనములు ఇప్పటి యువతకు మార్గదర్శకము కావలెను.

Advertisements