నవీకృతం తు తత్ సర్వం వాక్యైస్తే ధర్మచారిణి । పతిశుశ్రూషణాన్నార్యాః తపో నాన్యద్విధీయతే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే అష్టదశోత్తరశతతమస్సర్గః (౯వ శ్లోకము)

శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించిన అనసూయాదేవితో సీత ఇట్లు అద్భుత సమాధానమిచ్చెను:

“మా అత్తగారు, అమ్మ, నాకు చేసిన ఉపదేశములు మీరు జ్ఞప్తికి తెచ్చినారు. పతి శుశ్రూషయే స్త్రీకి గొప్ప తపస్సు. దీనిని మించిన తపస్సు స్త్రీకి లేదు”.

ఈ శ్లోకము ద్వారా స్త్రీధర్మాలే కాకుండా, మధురము మాటలెలా మాట్లాడాలో సీతాదేవి మనకు నేర్పుతున్నది. లోకములో విషయములు పునశ్చరించినప్పుడు జనులకి ఈ విషము తెలుసుననే హేయభావముండును. కాని ధార్మికవిషయములందు పునశ్చరించుటే ఉత్తమమని సీతాదేవి చూపుతున్నది. పెద్దలైన అత్త, తల్లి యొక్క ధర్మనిరతిని కూడా తలుచుకొన్నది!

Advertisements