తదేవమేనం త్వమనువ్రతా సతీ పతివ్రతానాం సమయానువర్తినీ । భవ స్వభర్తుః సహధర్మచారిణీ యశశ్చ ధర్మం చ తతస్సమాప్స్యసి ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౨౭వ శ్లోకము)

శ్రీరాముని అనుగమించి వచ్చిన సీతను అభినందించి, స్త్రీధర్మాన్ని బోధించే ఈ అద్భుత శ్లోకమును చెప్పెను అనసూయాదేవి:

నీవు పతిసేవనమందే నిమగ్నమైయ్యుండుము. పతివ్రతాధర్మము పాటించుము. నీ భర్తకు సహధర్మచారిణివైయ్యుండుము. ఇదే నీకు కీర్తిని, ఉత్తమ ధర్మఫలమును ఇచ్చును.

Advertisements