స్వయమాతిథ్యమాదిశ్య సర్వమస్య సుసత్కృతమ్ । సౌమిత్రిం చ మహాభాగాం సీతాం చ సమసాన్త్వయత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౬వ శ్లోకము)

అత్రిమహాముని స్వయముగా సీతారామలక్ష్మణులకు సకలమైన అతిథిసత్కారములు చేసెను. వారితో అనునయవచనములు పల్కెనని ఈ శ్లోకార్థము.

భార్తతీయుల జీవనములో అతిథిసత్కారము యొక్క ప్రాధాన్యత ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. మహాతపస్వి, మహర్షి, వచ్చిన అతిథులకు (శ్రీరామాదులకు) గురుస్థానములో ఉండి కూడా, అత్రిమహర్షి అతిథిపూజ చేసెను.

Advertisements