తామిమాం సర్వభూతానాం నమస్కార్యాం యశస్వినీమ్ । అభిగచ్ఛతు వైదేహీ వృద్ధామక్రోధనాం సదా । అనసూయేతి యా లోకే కర్మభిః ఖ్యాతిమాగతా ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే సప్తదశోత్తరశతతమస్సర్గః (౧౨వ శ్లోకము)

అత్రిమహర్షి అనసూయాదేవి యోక్క ఔన్నత్యము, తపశ్శక్తి, గూర్చి సీతారాములకు వివరిస్తూ ఈ శ్లోకము చెప్పెను:

“(ఒకసారి ముల్లోకములలో పది సంవత్సరముల క్షామమేర్పడినది. అప్పడు అనసూయాదేవి తన తపశ్శక్తితో ఫలమూలములు, గంగను సృష్టించి కాపాడెను. అందుకని) ఈమె ముల్లోకములలోని సర్వభూతములకు పూజ్యురాలు. ఈమె క్రోధమును జయించిన పరమ శాంతమూర్తి. తన సత్కర్మలద్వారా ‘అనసూయ’ (అంటే అసూయ లేనిది) అని పేరు సంపాదించుకొన్నది.”

భరతజాతిలో స్త్రీ యొక్క ఔన్నత్యమును చాటే అనసూయాదేవి వంటి సాధ్వీమణులు మనకు మార్గదర్శకము కావలెను.

Advertisements