పాదుకేత్వభిషిచ్యాథ నన్దిగ్రామేవసత్ తదా । సవాలవ్యజనం ఛత్రం ధారయామాస స స్వయమ్ । భరతశ్శాసనం సర్వం పాదుకాభ్యాం న్యవేదయత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చదశోత్తరశతతమస్సర్గః (౨౫వ శ్లోకము)

భరతుడు శ్రీరామ పాదుకలకి పట్టాభిషేకముచేసి, రాజ్యపాలనము నందిగ్రామమునుండే శ్రద్ధాభక్తులతో నడుపుచుండెను. అతడే ప్రేమగా పాదుకలకు వింజామరలు వీచి, ఛత్రము పట్టి సేవించుచుండెను. రాజ్యపాలన విశేషములన్నీ పాదుకలకు నివేదించుచుండెనని ఈ శ్లోకార్థము.

నిజమైన భగవద్భక్తి, కర్మయోగము, భరతుని వద్దనే మనము నేర్వాలి!

Advertisements