తేషామౌత్సుక్యమాలక్ష్య రామస్త్వాత్మని శఙ్కితః । కృతాఞ్జలిరువాచేదమ్ ఋషిం కులపతిం తతః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే షోడశోత్తరశతతమస్సర్గః (౪వ శ్లోకము)

ఒకనాడు శ్రీరాముడు చిత్రకూటము వద్ద నివసించు మునులలో ఆందోళనను వారి ముఖకవళికల ద్వారా గమనించెను. సాధుల కష్టములు చూడలేని ఆతడు, ఆందోళనకు కారమేమని ఆలోచించి, ప్రప్రథమముగా తనే తెలియ కారణము కాదు కదా? అని ఆత్మశంకచేసుకొనెనని ఈ శ్లోకార్థము.

ఆత్మవిచారణ బహు ఉత్తమగుణము. ఇది మనము శ్రీరాముని వద్ద నేర్వవలెను. అతడి పరధార్మికుడైయ్యుండి కూడా, రాజైకూడా, మెట్టమొదట తనను తానే శంకించుకొనెను!

Advertisements