ఆశ్రమం త్వృషివిరహితం ప్రభుః క్షణమపి న విజహౌ స రాఘవః । రాఘవం హి సతతమనుగతాః తాపసాశ్చార్షచరితధృతగుణాః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే షోడశోత్తరశతతమస్సర్గః (౨౬వ శ్లోకము)

ఒక్కక్షణముకూడా శ్రీరాముడు ఋషులను విడిచి, ఋషులు శ్రీరాముని చింతన విడిచి ఉండలేకపోయెడివారు, అని ఈ శ్లోకార్థము.

మనము కూడా ఏ వర్ణాశ్రమాలలోనున్నా ఋషులవలె నిరంతరము భగవధ్యానము చేయవలెను. అట్టి భక్తుల యోగక్షేమము శ్రీరాముడే కాపాడును!

Advertisements