రథస్థః స హి ధర్మాత్మా భరతో భ్రాతృవత్సలః । నన్దిగ్రామం యయౌ తూర్ణం శిరస్యాధాయ పాదుకే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చదశోత్తరశతతమస్సర్గః (౧౨వ శ్లోకము)

భ్రాతృప్రేమగల భరతుడు, శ్రీరాముని పాదుకలు శిరస్సున ఉంచుకొని నందిగ్రామ ప్రయాణము చేసెను.

మనము కూడా భరతునివలె భగవంతుని నెత్తినపెట్టుకొని, ఆయన ఆజ్ఞలైన ధర్మములను శిరోధార్యములుగా పాటించవలెను.

Advertisements