మన్దాకినీం నదీం రమ్యాం ప్రాఙ్ముఖాస్తే యయుస్తదా । ప్రదక్షిణం చ కుర్వాణాః చిత్రకూటం మహాగిరిమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే త్రయోదశోత్తరశతతమస్సర్గః (౩వ శ్లోకము)

భరతుడు, ఆతని పరివారము మహాగిరియైన చిత్రకూటపర్వతమును భగవద్విభూతిగా భావించి ప్రదక్షిణము చేసిరని ఈ శ్లోకముద్వారా తెలుస్తున్నది.

దివ్యమైన నగవృక్షాదులు, పవిత్ర నదీతీర్థములు, భగవంతుని దివ్యవిభూతులన్న ఎరుకతో ఉండి, వాటిని సేవించే భారతీయులు ధన్యజీవులు.

Advertisements