తవ పాదుకయోర్న్యస్య రాజ్యతన్త్రం పరన్తప ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వాదశోత్తరశతతమస్సర్గః (౨౫వ శ్లోకము)

“శ్రీరామా! ఈ పదునాలుగు సంవత్సరములు నీ పాదుకలయందే నేను ఈ రాజ్యమును న్యాసముచేసి, నిమిత్తమాత్రుడనై ధర్మపాలనము చేయుదును”.

భగవద్గీతలో శ్రీకృష్ణస్వామి వివరించిన కర్మయోగమును ఉత్తమ ఉదాహరణము భరతుడు అని ఈ శ్లోకము ద్వారా తెలుస్తున్నది. భరతుని వలె మనముకూడా శక్తిప్రదాత భగవంతుడే అన్న ఎరుకతో ఉండి, కర్తవ్యముపై మమకారమును విడిచి, కర్తవ్యపాలనము చేయవలెను.

Advertisements