తదా తదన్తఃపురముజ్ఘితప్రభం సురైరివోత్సృష్టమభాస్కరం దినమ్ ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే చతుర్దశోత్తరశతతమస్సర్గః (౩౧వ శ్లోకము)

శ్రీరాముడు, దశరథుడు, లేని అంతఃపురము శోభావిహీనముగా ఉన్నదని వర్ణిస్తూ వాల్మీకిమహర్షి ఈ శ్లోకము పల్కిరి:

“ఎట్లాగైతే సూర్యుడు మేఘములచే కప్పబడి కనిపించని దినమును దేవతలు దుర్దినముగా పరిగణించి (అన్నపానాదులు స్వీకరించకుండా) వదిలివేస్తారో, అట్లే (శ్రీరామ, దశరథులు లేని) అంతఃపురముకూడా శోభావిహీనమైనది”.

“మేఘచ్ఛన్నేహ్ని దుర్దినమ్” అని శాస్త్రవాక్కు. అట్టి రోజులో దేవతలు అన్నపానాదులు స్వీకరింపరు. తదనుసారముగా ఆస్తికులైనవారు కూడా సూర్యుడు కన్పించువరకు ఉపవసింతురు.

సూర్యభగవానుని చూచిన తరువాతనే అన్నపానాదులు స్వీకరించాలన్న ధర్మాన్ని జ్ఞప్తికితెచ్చే ఈ శ్లోకము చిరస్మరణీయము.

Advertisements