తతః ప్రదక్షిణం కృత్వా భరద్వాజం పునః పునః । భరతస్తు యయౌ శ్రీమాన్ అయోధ్యాం సహ మన్త్రిభిః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే త్రయోదశోత్తరశతతమస్సర్గః (౧౯వ శ్లోకము)

భరతుడు పదే పదే భరద్వాజ మహర్షికి ప్రదక్షిణ పూర్వక నమస్కారములు చేసెనని ఈ శ్లోకపు భావము. గురువులయెడ ఎంతటి వినయవిధేయతలతో మెలగాలో మనము భరతుని వద్ద నేర్వాలి.

Advertisements