కామాద్వా తాత లోభాద్వా మాత్రాతుభ్యమిదం కృతమ్ । న తన్మనసి కర్తవ్యం వర్తితవ్యం చ మాతృవత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ద్వాదశోత్తరశతతమస్సర్గః (౧౯వ శ్లోకము)

తల్లిదండ్రులను ఎల్లప్పుడూ గౌరవభావముతో సేవించవలసినదే అని నిర్దేశిస్తూ శ్రీరాముడు భరతునితో ఈ శ్లోకమును పల్కెను:

“నాయనా! భరతా! కైకేయీమాత తీరనికోరికచేగాని, రాజ్యలోభముచేగాని, నీపైగల మమకారముచేగాని, మరేకారణమునకైగాని ఇట్లు చేసినాసరే, దానిని నీవు మనసులో పెట్టుకొనవలదు. నీవు ఆమెను సముచితముగా ఎల్లప్పుడూ గౌరవించుచుండుము”.

Advertisements