లక్ష్మీశ్చన్ద్రాదపేయాద్వా హిమవాన్ వా హిమం త్యజేత్ । అతీయాత్ సాగరో వేలాం న ప్రతిజ్ఞామహం పితుః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౧౮వ శ్లోకము)

శ్రీరాముడు భరతునితోనిట్లనెను: “ఒకవేళ చంద్రునినుండి వెన్నెల దూరమవ్వచ్చును, హిమవత్పర్వతము నుండి మంచు వేర్పడచ్చు, సముద్రము చెలియలకట్టదాటవచ్చు, కానీ నేను మాత్రము నాన్నగారి మాట వమ్ముకానివ్వను”.

సత్యముపై శ్రీరామునికిగల స్థిరచిత్తము ఈ శ్లోకముద్వారా వాల్మీకిమహర్షి ప్రకాశింపచేసినారు.

Advertisements