ఉపధిర్న మయా కార్యో వనవాసే జుగుప్సితః ।

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౨౯వ శ్లోకము)

శ్రీరాముని మీది అమితమైన ప్రేమావేశముతో భరతుడు తానే అన్నగారికి బదులుగా వనవాసవ్రతము చేసెదనని అందరిముందరా ఘోషించెను. అప్పుడు శ్రీరాముడీ అమృతవాక్కులను పలికెను:

“నాకు మారుగా భరతుడు వనవాసము చేయుటకు నేనిష్టపడను. ఏలన సమర్థుడైనవాడు ప్రతినిధితో పని చేయించుట అత్యంత జుగుప్సాకరము కదా”!

కాబట్టి మన కర్తవ్యమును మనమే నెరవేర్చుకో వలెను. అవతలవానికి దానిని అప్పచెప్పరాదు. ఇట్టి సోమరిని రాముడు మెచ్చడని ఈ శ్లోకము ద్వారా తెలియుచున్నది.

Advertisements