బ్రాహ్మణో హ్యేకపార్శ్వేన నరాన్ రోద్ధుమిహార్హతి । న తు మూర్ధాభిషిక్తానాం విధిః ప్రత్యుపవేశనే ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే ఏకాదశోత్తరశతతమస్సర్గః (౧౭వ శ్లోకము)

ఎందరు ఎంత చెప్పినా శ్రీరాముడు అయోధ్యకు మరలిరావటం లేదు. ఈ పరిస్థితిలో ఏమిచేయాలో పాలుపోక భరతుడు శ్రీరాముడు కదలివచ్చేవరకు నిరాహారదీక్షపట్టి ఆయనకు అడ్డముగా పరుందామనుకొనెను. ఆ ప్రయతమును వారిస్తున్న శ్రీరాముడిలా పరమధర్మవచనములను పల్కెను:

“అధర్మమును ఎదురుకోడానికి సాధుజీవనులైన బ్రాహ్మణులు ఇట్లా ఒకవైపుకు పరుండి నిరాహారదీక్షను చేయుట తగును. కానీ క్షత్రియులకు ఇది ధర్మముకాదు (వారు తమ శక్తిసామర్థ్యములద్వారేనే పనులు సాధించవలెను). కాబట్టి, నీవీప్రయత్నమును విరమింపుము”.

Advertisements