యథాహి చోరః స తథాహి బుద్ధః తథాగతం నాస్తికమత్ర విద్ధి । తస్మాద్ధి యఃశఙ్క్యతమః ప్రజానాం న నాస్తికేనాభిముఖో బుధః స్యాత్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౩౪వ శ్లోకము)

“ఎట్లాగైతే నేర్పరితనమున్నా ఒక చోరుడు దండనార్హుడో, అట్లే తెలివైనవాడైనాసరే వేదధర్మమునకు విరోధియైన నాస్తికుడు కూడా దండనార్హుడే. ఇట్టివానిని సమాజము శంకించవలసినదే. సత్పురుషులైనవారు నాస్తికులతో వాదించరాదు, ఎట్టి సంబంధమునూ పెట్టుకొనరాదు”, అని శ్రీరాముడు జాబాలిమహర్షితో హితవు పల్కెను.

కాబట్టి మనము నాస్తికులకు వీలైనంతే దూరముగానుండుటే శ్రేయస్కరము.

Advertisements