సత్యమేవేశ్వరో లోకే సత్యం పద్మాశ్రితా సదా । సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరం పదమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౩వ శ్లోకము)

జాబాలి మహర్షికి సమాధనమిస్తూ సత్యము యొక్క వైభవాన్ని ఇలా వర్ణిస్తున్నాడు శ్రీరాముడు:

“లోకములో సత్యమే భగవత్స్వరూపము. సంపదలన్నీ సత్యమునే ఆధారముగా చేసుకున్నాయి. అంతటికి సత్యమే మూలము. సత్యముకంటే పరమమైనదేదీ లేదు”.

Advertisements