సత్యం చ ధర్మం చ పరాక్రమం చ భూతానుకమ్పాం ప్రియవాదితాం చ । ద్విజాతి దేవాతిథిపూజనం చ పన్థానమాహుః త్రిదివస్య సన్తః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౩౧వ శ్లోకము)

ఉత్తమ క్షత్రియునికుండవలసిన లక్షణములను ఇక్కడ ఉటంకిస్తున్నాడు రాఘవుడు:

“సత్యము, స్వధర్మము, పరాక్రమము, భూతదయ, మృదువుగా మాట్లాడుట, వేదపండితులను, దేవతలను, అతిథులను పూజించుట క్షత్రియుని ముఖ్యకర్తవ్యములు”.

Advertisements