నైవ లోభాన్నమోహాద్వా నహ్యజ్ఞానాత్ తమోన్వితః । సేతుం సత్యస్య భేత్స్యామి గురోః సత్యప్రతిశ్రవః ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౭వ శ్లోకము)

 జాబాలి మహర్షికి సమాధానమిస్తూ సత్యవర్తనముపైన తనకున్న దృఢత్వాన్ని ఆవిష్కరించే ఈ శ్లోకాన్ని చెప్పాడు శ్రీరాముడు:

“ (రాజ్య) లోభము వలన కాని, (తమ్ములయందు) మోహము వలన కాని, (ఇతర) అజ్ఞానము వలన కాని, ఇప్పుడు నేను అవివేకివలె  (తండ్రిని సత్యపథమునందు నిలుపుతానన్న) నా ప్రతిజ్ఞను, పూజ్యులైన తండ్రిగారి వాగ్దానమును భంగపరచలేను”.

Advertisements