ఋషయశ్చైవ దేవాశ్చ సత్యమేవ హి మేనిరే । సత్యవాదీ హి లోకేస్మిన్ పరమం గచ్ఛతి క్షయమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౧వ శ్లోకము)

“ఋషులు, దేవతలు, అందరూ సత్యమే మిగుల శ్రేష్ఠమైనదని తలంతురు. లోకములో కూడా ఉన్నతి సత్యపాలనమువల్లనే కలుగును”, అని శ్రీరాముడు జాబాలి మహర్షితో చెప్పెను.

సత్యవైభవమును తెలిపే ఈ శ్లోకము చిరస్మరణీయము.

Advertisements