అసత్యసన్ధస్య సతః చలస్యాస్థిరచేతసః । నైవ దేవా న పితరః ప్రతీచ్ఛన్తీతి నః శ్రుతమ్ ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౧౮వ శ్లోకము)

జాబాలి మహర్షికి సమాధానమిస్తూ ఈ ధర్మబోభకమైన శ్లోకాన్ని చెప్పాడు శ్రీరాముడు:

“మాటకు కట్టుబడని చంచల మనస్కుడిచ్చే హవ్యకవ్యాదులవంటి మహాపుణ్యవస్తువులను సైతము దేవతలు, పితృదేవతలు స్వీకరించరని వేదాలు ఘోషిస్తున్నాయి”.

Advertisements