అమృష్యమాణః పునరుగ్రతేజా నిశమ్య తం నాస్తికవాక్యహేతుమ్ । అథాబ్రవీత్ తం నృపతేస్తనూజో విగర్హమాణో వచనాని తస్య ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః  (౩౦వ శ్లోకము)

శ్రీరాముని ఎలాగైనాసరే తిరిగి అయోధ్యకు రప్పించాలని జాబాలి మహర్షి నాస్తిక బోధలు చేసిరి. ఈ దుర్బోధలు వినిన శ్రీరాముడు క్రుద్ధుడయ్యెను:

“మహాతేజస్వియైన శ్రీరాముడు నాస్తిక సిద్ధాంతమును విని, దానిని సహించనివాడై, ఆ వచనములను శాస్త్రవచనముల ద్వారా ఖండించుచు బదులిచ్చెను”.

నాస్తికవాదము, హేతువాదము ఎన్నడు చేయరాదని శ్రీరాముని సందేశము. కాబట్టి మనమెల్లప్పుడు సర్వద్రష్టలైన మహర్షులందించిన శాస్త్రములనే ఆధారముగా చేసుకుని, తదనుసారము జీవించవలెను.

Advertisements