కస్య ధాస్యామ్యహం వృత్తం కేన వా స్వర్గమాప్నుయామ్ । అనయా వర్తమానో హి వృత్త్యా హీనప్రతిజ్ఞయా ॥

శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే నవోత్తరశతతమస్సర్గః (౮వ శ్లోకము)

అయోధ్యకి తిరిగిరమ్మని బోధించిన జాబాలిమహర్షితో శ్రీరాముడు ఇలా ధర్మవాక్కులను పలికెను:

“నేను చేసిన ప్రతిజ్ఞను నేనే తప్పితే ఇక ఇతరులకు మంచిని ఎట్లు ఉపదేశించగలను? ఏ విధముగా (స్వర్గాది) శుభములను పొందగలను”?

అసత్యదోషము చేసినవాడు ఎట్టి శుభములను పొందలేడని, మీదు మిక్కిలి తోటివారికి మంచి సలహాలు ఇచ్చే అర్హతను కూడా కోల్పోతాడని శ్రీరాముని సందేశము. కాబట్టి మనమెల్లప్పుడూ సత్యపథమునందే నడువవలెను.

Advertisements