నైవాహం రాజ్యమిచ్ఛామి న సుఖం న చ మైథిలీమ్ । నైవ సర్వానిమాన్ కామాన్ న స్వర్గం నైవ జీవితమ్ ॥ త్వామహం సత్యమిచ్ఛామి నానృతం పురుషర్షభ ।

— శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే చతుస్త్రింశస్సర్గః (౪౭-౪౮)

‘ధర్మమును ఎందుకు పాటించవలెను?’ అన్న ప్రశ్నకు సరియైన సమాధానము శ్రీరాముడు ఈ శ్లోకముల ద్వారా ఇచ్చినారు. దైవసమానుడైన తండ్రిని సత్యమునందు నిలుపుట – అనే ధర్మముపైననే తనకు మక్కువకలదనీ, రాజ్యముపైనగానీ, తన ప్రాణసమానమైన సతిపైగానీ, తన జీవితముపైగానీ , పరలోకగతులపైగానీ తనకు మక్కువలేదని తేల్చిచెప్పినాడు.

కాబట్టి ధర్మమును కేవలము ధర్మముకోసమే పాటించవలెను కానీ ఇహ, పర సుఖములు కాంక్షించి కాదని శ్రీరాముని సందేశము. జీవితముపై కానీ, ఇతర ప్రాణాధికమైన వస్తువుల (శ్రీరామునికి సీత) పైకానీ మక్కువ కంటే ధర్మపాలనముపైననే ఎక్కువ మక్కువ ఉండవలెనని శ్రీరాముని ఆంతర్యము.